
హైదరాబాద్, వెలుగు: సిమెంట్ బోర్డులు తయారు చేసే విశాక ఇండస్ట్రీస్ 2025 మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌కు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు సంస్థ బలమైన ఆర్థిక వృద్ధిని, మెరుగైన పనితీరును తెలియజేస్తున్నాయి. 2025 మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ. 14.57 కోట్లుగా ఉంది.
గత ఏడాది ఇదే కాలంలో రూ. 1.15 కోట్లు వచ్చాయి. ఈసారి ఏకంగా 1,166.96శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల విలువ 7.53 శాతం పెరిగి రూ.396.03 కోట్ల నుంచి రూ.425.85 కోట్లకు చేరింది. మొత్తం 2024–-25 ఆర్థిక సంవత్సరానికి గాను, సంస్థ రూ. 3.01 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది.
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 0.86 కోట్ల నికర లాభం ఉంది. ఇదే కాలంలో అమ్మకాల విలువ ఒకశాతం పెరిగి రూ.1,543 కోట్లుగా రికార్డయింది.