విశాక ఇండస్ట్రీస్‌‌  ఆదాయం రూ.453.47 కోట్లు

విశాక ఇండస్ట్రీస్‌‌  ఆదాయం రూ.453.47 కోట్లు
  • ఫేస్‌ వాల్యూలో 30%  డివిడెండ్‌‌‌‌..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిమెంట్ రూఫ్‌‌‌‌లను తయారు చేసే హైదరాబాద్‌‌‌‌ కంపెనీ  విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ4) ‌‌‌‌లో రూ. 453.47 కోట్ల ఆదాయం (స్టాండ్ ఎలోన్‌‌‌‌) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.423.29 కోట్ల ఆదాయం సాధించిన కంపెనీ, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.357.41 కోట్లు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీకి రూ. 1,658 కోట్ల ఆదాయం, రూ. 54.79 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,425.67 కోట్ల ఆదాయాన్ని, రూ.118.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సెగ్మెంట్ వైజ్‌‌‌‌గా చూస్తే విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  బిల్డింగ్ ప్రొడక్ట్‌‌‌‌ల బిజినెస్ నుంచి రూ.389.80 కోట్ల ఆదాయం వచ్చింది. సింథటిక్ బ్లెండిడ్ యార్న్‌‌‌‌ నుంచి రూ. 62.69 కోట్లు వచ్చాయి.  2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సెగ్మెంట్ల నుంచి వరుసగా రూ. 1,357.52 కోట్లు, రూ.295.91 కోట్ల ఆదాయం వచ్చింది.

వచ్చే నెల 7 న ఏజీఎం

2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఫేస్ వాల్యూ రూ.2 ఉన్న షేరుపై  60 పైసలు డివిడెండ్‌‌‌‌ (30%) గా ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే నెల 7న జరగనున్న ఏజీఎంలో డివిడెండ్‌‌‌‌ నిర్ణయంపై షేర్ హోల్డర్ల అనుమతి తీసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌1 న జరిగిన మీటింగ్‌‌‌‌లో 2022–23 కి గాను రూ.10 ఫేస్‌‌‌‌ వాల్యూ ఉన్న షేరుపై కంపెనీ  రూ.7 ఇంటెరిమ్‌‌‌‌ డివిడెండ్‌‌‌‌ ఇచ్చింది. ఈ నెల 15 న కంపెనీ షేర్లను స్ప్లిట్‌‌‌‌ చేశారు. షేర్‌‌‌‌ ఫేస్ వాల్యూ రూ.10 నుంచి  రూ. 2 గా మారింది.

వీ- బోర్డ్‌‌‌‌ కెపాసిటీ పెంపు.. 

ఇప్పటికే ఉన్న వీ–బోర్డ్ ప్లాంట్‌‌‌‌ల కెపాసిటీని పెంచడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని దెల్వాడి, హార్యానాలోని జజ్జర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల సామర్ధ్యాన్ని ఏడాదికి 24,000 టన్నుల చొప్పున పెంచనున్నారు. ఇందుకోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు టెక్స్‌‌‌‌టైల్ యూనిట్లను కూడా విస్తరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. నాగ్‌‌‌‌పూర్ (మహారాష్ట్ర)లోని ప్లాంట్‌‌‌‌ కెపాసిటీని 15 % పెంచనుండగా, రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నారు.