పాక్ లో పట్టుబడ్డ నా కొడుకును తెచ్చివ్వండి: తండ్రి ఆవేదన

పాక్ లో పట్టుబడ్డ నా కొడుకును తెచ్చివ్వండి: తండ్రి ఆవేదన

బార్డర్ దాటి పాకిస్తాన్ లో పట్టుబడ్డాడు విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి. అయితే ప్రశాంత్ కుంటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పంధించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ తండ్రి  బాబురావు మీడియాతో మాట్లాడుతూ… ప్రశాంత్ బెంగళూరులోని హువాయి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసేవాడని చెప్పారు. అక్కడ అతనికి స్వప్నికా పాండే అనే అమ్మాయితో పరిచయం ఉండేదని చెప్పారు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తాము అనుకున్నట్లు తెలిపారు. అయితే 2017 లో పని మీద మాదాపూర్ లోని షోర్ టెక్నాలజీ ఆఫీసుకి వెళ్లిన ప్రశాంత్ తిరిగి రాలేదని చెప్పాడు. అయితే…. ప్రేమ విఫలమై డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటాడని అనుకున్నామని.. చాలా రోజులు చూసి మాదాపూర్ పోలిస్టేషన్ లో తప్పిపోయాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తొందరగా ప్రశాంత్ ను వెనక్కి తీసుకరమ్మని వేడుకుంటున్నట్లు చెప్పారు బాబురావు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫోన్ లో మాట్లాడి వివరాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.