
విశాఖ: బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ వాసి మృత్యువాత పడ్డాడు. విశాఖ జిల్లా గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన కొలిసి సూర్య నారాయణ విజిటింగ్ వీసా పై మలేషియా వెళ్లాడు. కుటుంబ పోషణ కోసం అక్కడ ఉద్యోగం చేద్దామనుకొన్న ఆయన.. ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో ఆయన భార్యా పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. తన భర్తను ఇండియాకు రప్పించాలని మృతుని భార్య జయ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై స్ధానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎంపి ఎంవీవీ సత్యనారాయణలు.. మృతుడు కె సుర్యనారాయణను రప్పించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.