మేము కరోనా నుంచి కోలుకోవడానికి కారణమిదే..విశాల్ వీడియో

మేము కరోనా నుంచి కోలుకోవడానికి కారణమిదే..విశాల్ వీడియో


సినీ నటుడు విశాల్, తన తండ్రి జీకే రెడ్డి కరోనా నుంచి  కోలుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తాము కరోనా నుంచి ఎలా కోలుకున్నామో చెప్పారు. వాళ్ల నాన్న(82)కు జూన్ లో కరోనా వచ్చిందని అయితే  తనను హాస్పిటల్ లో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి దగ్గరుండి తన తండ్రిని  చూసుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే   కరోనా వైరస్ తనకు కూడా సోకిందని..తనతో పాటు ఉండే తన మేనేజర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా వచ్చిన వారు ఆత్మస్థైర్యంతో భయపడకుండా ఉండాలన్నారు. ఆ దైర్య‌మే తమను మూడు వారాల్లో పూర్తిగా కోలుకునేలా చేసిందన్నారు.

 

అలాగే   డాక్ట‌ర్ హరీశ్ శంకర్ ఇచ్చిన ఆయుర్వేదిక్, హోమియో్పతి  మందులు కూడా మాకు హెల్ప్  అయ్యాయన్నారు. ముఖ్యంగా 82 సంవ‌త్స‌రాలున్న నాన్న గారికి చాలా హెల్ప్ అయిందన్నారు. నేను ఏ విద‌మైన ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలేదు. కేవ‌లం ఈ మెడిసిన్ ద్వారా  నేను, మానాన్న గారు, మా మేనేజ‌ర్ కోవిడ్‌-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అంద‌రికీ చెప్పాల‌న్న‌దే నా కోరిక అని అన్నారు ప్ర‌ముఖ హీరో విశాల్‌. ఈ విష‌యాన్ని కూడా మీ అంద‌రికీ తెలియ‌జేయాల‌ని ఈ వీడియో చేస్తున్నాను త‌ప్ప తాను డాక్ట‌ర్స్‌, హాస్పి‌ట‌ల్స్‌, మెడిసిన్  వ్య‌వ‌స్థ‌కి వ్య‌తిరేకం కాదన్నారు. తమకు  ఏ మెడిసిన్  ఉప‌యోగ‌ప‌డిందో  ఆ వివ‌రాలు తన  ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశానన్నారు.  అంద‌రూ దైర్యంగా  ఉంటే కరోనాను ఎదుుర్కోగలమన్నాడు విశాల్.