
యాక్షన్ సినిమాలతో మెస్మరైజ్ చేసే విశాల్ ఇప్పుడు ‘లాఠీ’ అనే ప్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎ.వినోద్ కుమార్ దర్శకుడు. సునయన హీరోయిన్. ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని రమణ, నంద కలిసి నిర్మిస్తున్నారు. నిన్న మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 12న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ 'లాఠీ' తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికాడనేది కథ. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే టైటిల్‌తో రిలీజ్ కానుంది. ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఫైట్ సీన్స్ షూట్ జరుగుతోంది. సెకెండాఫ్‌లో వచ్చే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయన్నారు దర్శక నిర్మాతలు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.