సముద్రం బ్యాక్ డ్రాప్ లో విశాల్ మకుటం మూవీ..

సముద్రం బ్యాక్ డ్రాప్ లో విశాల్ మకుటం మూవీ..

విశాల్  హీరోగా రవి అరసు దర్శకత్వంలో  రీసెంట్‌‌‌‌గా ఓ చిత్రం ప్రారంభమైంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న 99వ చిత్రమిది. ఆదివారం  ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మకుటం’ అనే టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌‌‌‌ ఆకట్టుకుంది. సముద్రం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నట్టు రివీల్ చేశారు. 

విశాల్ హీరోగా నటిస్తున్న 35వ చిత్రం కాగా,  అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. తంబి రామయ్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌‌‌‌గా, దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.