థియేటర్స్లో దూసుకెళ్తున్న విశాల్ మార్క్ ఆంటోని.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

థియేటర్స్లో దూసుకెళ్తున్న విశాల్ మార్క్ ఆంటోని.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

తమిళ స్టార్ విశాల్ (Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని(Mark Antony). అధిక రవిచంద్రన్(Adhik Ravichandran) తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో.. ఎస్ జె సూర్య(Sj surya), సునీల్(Sunil), సెల్వ రాఘవన్(Selva raghavan), రీతూ వర్మ(Ritu varma), అభినయ(Abhinaya) కీ రోల్స్ ప్లే చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ..థియేటర్లో దూసుకెళ్తుంది. 

ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే..

మార్క్ ఆంటోనీ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించగా..సుమారు రూ. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్లకు ఫిక్స్ కాగా..రిలీజైన ఫస్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. సుమారు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి హీరో విశాల్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. రాష్ట్రాల వైస్ గా కలెక్షన్స్ చూసుకుంటే..తెలుగులో రూ.1 కోటి షేర్ చేయగా, రూ. 2 కోట్ల గ్రాస్, తమిళంలో రూ.5.5 కోట్లు షేర్, రూ.7.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్  సాధించింది. 

ఇక సెకండ్ డే చూసుకుంటే..తెలుగులో కొంత మేరకు వసూళ్లు తగ్గిపోగా, తమిళంలో మాత్రం అదే హవా కొనసాగిస్తోంది. తమిళంలో రూ.1.35 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, తెలుగులో రూ. 70 లక్షల రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ 2వ రోజున వరల్డ్ వైడ్‍గా రూ. 6.29 కోట్ల షేర్, రూ. 8.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. 

ఓవరాల్గా మార్క్ ఆంటోనీ మూవీకి 2 రోజుల్లో తమిళనాడులో రూ.16.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.45 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.2.80 కోట్లు, ఓవర్సీస్‍లో రూ.3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 25.45 కోట్ల గ్రాస్, రూ. 12.60 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి థియేటర్లో దూసుకెళ్తుంది. అంటే, ఈ మూవీకి 27.4 కోట్లు వస్తేనే హిట్ టాక్ తెచ్చుకుంటుందని సమాచారం.  

మార్క్ ఆంటోనీ  సినిమాను తమిళనాడులో 1100 థియేటర్లు, ఏపీ-తెలంగాణలో 500 స్క్రీన్స్, కేరళ, కర్ణాటకలో సుమారు 500 థియేటర్లు, మొత్తంగా వరల్డ్ వైడ్‍గా 2900 స్క్రీన్లలో రిలీజ్ చేయగా..పాజిటివ్ టాక్ తో థియేటర్లో నడుస్తుంది. మరో వీకెండ్ వచ్చే వరకు..ఎటువంటి మూవీస్ కూడా రిలీజ్ కు రెడీ లేకపోవడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.