చత్తీస్​గఢ్​ సీఎంగా విష్ణు దేవ్​సాయ్​ ప్రమాణం

చత్తీస్​గఢ్​ సీఎంగా  విష్ణు దేవ్​సాయ్​ ప్రమాణం

రాయ్​పూర్: చత్తీస్‌‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ ఆయనతో ప్రమాణం చేయించారు. రాయ్‌‌పూర్‌‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 2003 నుంచి 2018 దాకా మూడుసార్లు సీఎంగా పనిచేసిన రమణ్‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌ను అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.