Crime Thriller: OCT 31న థియేటర్లోకి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్.. టీజర్, ట్రైలర్ చూస్తే ఫిక్స్ అయిపోతారు!

Crime Thriller: OCT 31న థియేటర్లోకి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్.. టీజర్, ట్రైలర్ చూస్తే ఫిక్స్ అయిపోతారు!

విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ రూపొందించిన చిత్రం ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆదివారం (అక్టోబర్ 26న) ఈ మూవీ సెకండ్ సాంగ్‌‌నురిలీజ్ చేశారు.

జిబ్రాన్ సాంగ్ కంపోజ్ చేయడంతోపాటు అభి వి, భృత్తతో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. సామ్రాట్ క్యాచీ  లిరిక్స్ అందించాడు. ‘పరిచయమే పదనిసలా మారిన తీరే బాగుందే.. అరకొరగా వినబడుతుందే కొత్తగా నాకే..’ అంటూ సాగిన మెలోడీలో  విష్ణు విశాల్, మానస చౌదరి  మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. 

టీజర్, ట్రైలర్ రెస్పాన్స్:

ఇటీవలే ఆర్యన్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓ హత్య దర్యాప్తుతో విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ సాగిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తీసుకెళ్లేలా ఉన్నాయి. ఓ సైకో తాను ఎవరిని హత్య చేయబోతున్నాడో గంట ముందు అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మరీ మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఆ గంటలోపు అతన్ని పట్టుకోగలగాలి.

పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తనదైన శైలిలో విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. సైకో క్రిమినల్గా సెల్వరాఘవన్ పాత్ర ఇంటెన్స్ కలిగిస్తుంది. ఈ సైకో చేసేది పర్ఫెక్ట్ క్రైమ్ కాదు.. అతనే పర్ఫెక్ట్ క్రిమినల్ అనే చెప్పే డైలాగ్.. తనలోని మృగాన్ని చూపించేలా ఉంది. ‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు. సినిమా క్లిక్ అయితే, విష్ణు విశాల్కి తెలుగులో మంచి క్యారెక్టర్స్ దక్కే ఛాన్స్ ఉంది. చూడాలి ఏమవుతుందో!

ఈ సినిమాలో సెల్వరాఘవన్తో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్  ఇతర పాత్రలు పోషించారు.

ALSO READ : క్రేజీ కాంబో.. జైలర్ దర్శకుడితో రామ్ చరణ్.!

విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘FIR’ చిత్ర  దర్శకుడు మను ఆనంద్ ఈ సినిమాకు కో రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నాడు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు.