అర్జున్ సినిమా వల్ల విశ్వక్ సేన్ కి ఇంత డ్యామేజ్ జరిగిందా..?

అర్జున్ సినిమా వల్ల విశ్వక్ సేన్ కి ఇంత డ్యామేజ్ జరిగిందా..?

వెటరన్ హీరో అర్జున్, మల్టీ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్లో రుపొందాల్సిన సినిమా అటకెక్కిన సంగతి తెలిసిందే. అర్జున్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ మీద విమర్శలు చేయటం ఆ మధ్య సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఆ వివాదం మళ్ళీ తెర పైకి వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం గామి సినిమా మార్చ్ 8న విడుదలకి సిద్దమవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది.

గామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విశ్వక్ సేన్ అర్జున్ సినిమా విషయంలో నెలకొన్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా విషయంలో అర్జున్ చేసిన కామెంట్స్ వల్ల తానే ఎక్కువ నష్టపోయానని, ఆ సినిమాను ఆపేయమని క్యాన్సిల్ చేయమని తానెన్నడూ అడగలేదని, ఒకరోజు షూటింగ్ మాత్రమే ఆపమని కోరానని అన్నాడు. ఆ సమయంలో అర్జున్ తమ ఇంటికి వచ్చి పేరెంట్స్ ని ప్రాధేయపడటం వంటివి చాలా జరిగాయని, తీసుకున్న రెమ్యునరేషన్ కంటే రెట్టింపు సొమ్ము అర్జున్ కి తిరిగి ఇచ్చానని, అలాంటివి నేను బయట పెట్టలేదని అన్నాడు.

ఈ విషయంలో ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకి లేదని చెప్పిన విశ్వక్ సేన్, ఇదే ఇన్సిడెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోల విషయంలో జరిగి ఉండుంటే ఏమయ్యేదని ప్రశ్నించాడు. తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చాడు.