విశ్వక్ సేన్ ‘ఫంకీ’ టీజర్‌‌‌‌ ఆన్ ద వే

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ టీజర్‌‌‌‌ ఆన్ ద వే

విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నాడు.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 10న టీజర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

‘సౌండ్, కెమెరా, లాఫ్టర్.. గెట్ రెడీ ఫర్ ఏ ఫుల్  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్’ అంటూ నిర్మాత నాగవంశీ ఈ అప్‌‌డేట్‌‌ తెలియజేస్తూ సోషల్‌‌ మీడియాలో పోస్ట్ చేశారు. విశ్వక్‌‌ సేన్‌‌కు జంటగా కయాదు లోహర్ నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.  కామెడీ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌గా రాబోతున్న ఈ చిత్రం సినీ ఇండస్ట్రీపై సెటైరిక‌‌ల్‌‌గా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో రానున్న టీజర్‌‌‌‌తో ఈ మూవీ  కాన్సెప్ట్‌‌ రివీల్ అయ్యే అవకాశం ఉంది.