
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) మరోసారి సోషల్ మీడియాలో రఫ్ఫాడించాడు. తన సినిమా గురించి తప్పుగా పోస్టులు చేసిన నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. గాడిద గుడ్డు.. తెలుసుకొని మాట్లాడు అంటూ తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ మెకానిక్ రాకీ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
#MechanicRocky తెలుగు రాష్టాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి
— devipriya (@sairaaj44) June 11, 2024
8 కోట్లకు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లెక్కన
కొనుగోలు చేసిన @asiansureshent
(జిఎస్టీతో కలిపి..)
ఇదిలా ఉంటే.. మెకానిక్ రాకీ గురించి తాజాగా ఒక నెటిజన్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కర్ణాటక ఏరియాలు కలిపి రూ.8 కోట్ల నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లెక్కన బిజినెస్ జరిగిందని, అది కూడా జీఎస్టీ కలుపుకొని అంటూ రాసుకొచ్చారు. దానికి స్పందించిన విశ్వక్ మాస్ కౌంటర్ వేశాడు.. గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు ట్విటర్‌లో పెట్టకండి. మెకానికి రాకీ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విక్రయాలు జరగలేదు. కొంచం నిజాలు తెలుసుకోండి. సినిమా అంటే ఓ టీమ్ కెరీర్‌కు సంబంధించింది.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.