Mechanic Rocky First Look: మాస్ అవతార్లో మెకానిక్ రాకీ.. విశ్వక్ ఫస్ట్ లుక్ అదిరింది!

Mechanic Rocky First Look: మాస్ అవతార్లో మెకానిక్ రాకీ.. విశ్వక్ ఫస్ట్ లుక్ అదిరింది!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwan sen) ప్రస్తుత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇటీవలే గామి(Gaami) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మంచి విజయం తోపేరు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. వినూత్న కథాంశంలో వచ్చిన గామి కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. 

ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావారి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విశ్వక్ మరి సినిమాను మొదలుపెట్టేశాడు. రవితేజ ముళ్ళపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి మార్చి 28 విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్బంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు మెకానిక్ రాకీ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. చేతిలో రెంచితో, నోట్లో సిగరెట్ తో స్టైలీష్ లో కనిపిస్తున్నారు విశ్వేక్ సేన్. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.

ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జెక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.