
ఒకే తరహా సినిమాలకు ఫిక్స్ అవకుండా డిఫరెంట్ జానర్స్‌లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్, ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి ఇతనే దర్శకుడు కూడా. ఇదిలా ఉంటే మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట విశ్వక్. కన్నడ స్టార్ అర్జున్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. ఓవైపు తెలుగు, తమిళ భాషల్లో కీలకపాత్రలు పోషిస్తున్న అర్జున్, అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే పదికి పైగా సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన కూతురు ఐశ్వర్య ఇందులో హీరోయిన్‌గా నటించబోతోందట. ఇదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగినట్టు టాక్. ఇక విశ్వక్ నటించిన ఓరి దేవుడా, గామి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. స్టూడెంట్, ఫలక్‌నుమా దాస్2 చిత్రాలు త్వరలో స్టార్ట్ అవనున్నాయి.