
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ శివాలెత్తిస్తున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ చూస్తే.. ఆడియన్స్ కూడా అదే అంటారు. మాస్ అవతార్ లో, నెక్స్ట్ లెవల్ మేకోవర్ తో అదరగొడుతున్నాడు విశ్వక్. కృష్ణ చైతన్య దర్శకతం చేస్తున్న కొత్త మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. విశ్వక్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మేకర్స్ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో విశ్వక్ ఫోటోను షేర్ చేస్తూ.. 'గంగానమ్మ జాతర మొదలైంది. ఈ సారి శివాలెత్తి పోద్ది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్టర్ లో గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను చేతితో పట్టుకున్న విశ్వక్ సేన్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకి ఛల్ మోహన్ రంగ ఫెమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.