
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మౌని రాయ్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. తాజాగా చిరంజీవి, మౌని రాయ్ కాంబినేషన్‌లో మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ పూర్తికానుంది.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా, ఈ హై ఎనర్జీ మాస్ సాంగ్‌ను మాత్రం భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. శ్యామ్ కాసర్ల లిరిక్స్ రాశాడు. గణేష్ ఆచార్య మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వంద మంది డ్యాన్సర్స్‌తో ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నామని, ఇది సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయనున్నారు.