సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం

సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం

సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఇతర ఏ పార్టీలకు లేదని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానన్నారు. తాను నెలకు ఒక్క లీడర్ ను అయినా బీజేపీకిలోకి తీసుకొస్తానని చెప్పారు. ‘టీఆర్ఎస్ లో మూడు విధానాలు నడుస్తున్నాయి. ఒకరు కాళ్లు మొక్కించుకోవడం, మరొకరు డబ్బులు తీసుకోవడం, ఇంకొకరు కేసులతో బెదిరించడం నడుస్తున్నాయి’ అని ఆరోపించారు. తాను బీజేపీలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికీ ముందుగానే తెలుసన్నారు. 

బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బండి సంజయ్ సన్మానించారు. ఇన్నాళ్లు తాను ఏ పార్టీకి మద్దతుగా లేనని, అందుకే తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది అడుగుతున్నారని అన్నారు.