స్టావెంజర్ (నార్వే): ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు.. నార్వే చెస్ టోర్నీలో మరో ఓటమి ఎదురైంది. గురువారం రాత్రి జరిగిన తొమ్మిదో రౌండ్‌లో విషీ 22 ఎత్తుల వద్ద షకిరియార్ మమెద్యారోవ్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడాడు. ఈ రౌండ్ తర్వాత ఆనంద్ 13 పాయింట్లతో మూడో ప్లేస్‌కు పడిపోయాడు. మరో గేమ్‌లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 54 ఎత్తుల వద్ద మ్యాక్సిమ్ వాచీర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ రౌండ్ అనంతరం కార్ల్‌సన్15 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, మమెద్యారోవ్ 14.5 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. మరోవైపు నార్వే చెస్ టోర్నీ గ్రూప్–ఎ ఓపెన్ టోర్నమెంట్‌లో ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ 7.5 పాయింట్లు సాధించి టైటిల్‌ను నెగ్గాడు.

