
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ దర్శకుడు ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాను ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ కు పోటీగా తీసుకొస్తున్నాని, అంతేకాదు కొంతమంది రాత్రి తాగి పొద్దున్న దేవుడు అని అంటున్నారని వివేక్ అగ్నిహోత్రి అన్నారనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై స్పందించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. "ప్రభాస్ ఒక పెద్ద స్టార్. చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసే నాకు ఆయనతో పోలిక ఎందుకు పెట్టుకుంటాను. అలాంటి దిగజారుడు పనులు నేను చేయను. సలార్ తో పాటు నా సినిమా రిలీజ్ అవడం అనేది కేవలం కాకతాళీయం మాత్రమే.. కావాలని ప్లాన్ చేసింది కాదు. అయినా ఇలాంటి రూమర్స్ ఎవరు ఎందుకు క్రియేట్ చేస్తారు అర్థం కాదు అంటూ ట్వీట్ చేశారు వివేక్.
Who is spreading such fake news attributing fake quotes to me? I respect Prabhas who is a mega mega star doing mega mega budget films.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 27, 2023
We make non-starrer, small budget, people’s films. There is no comparison between us.
Pl spare me. https://t.co/Y4mlIM0mTy