బంగ్లాలో హిందువులపై దాడులు ఆందోళనకరం: ఇండో– అమెరికన్ లీడర్ వివేక్ రామ స్వామి

బంగ్లాలో హిందువులపై దాడులు ఆందోళనకరం: ఇండో– అమెరికన్ లీడర్ వివేక్ రామ స్వామి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని అమెరికా రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దాడులు ఆందోళనకరం. స్వాతంత్ర్యం కోసం ఆ దేశం 1971లో యుద్ధం చేసింది. అప్పుడు వేలాది మంది బంగ్లాదేశీ పౌరులు హత్య, రేప్ కు గురయ్యారు. అనంతరం సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ కోటా విధానాన్ని అమలు చేసింది. 80 శాతం ఉద్యోగాలను నిర్దిష్ట సామాజిక వర్గాలకు కేటాయించింది. 1971లో జరిగిన తప్పులను సరిదిద్దడానికి తీసుకొచ్చిన కోటా విధానం 2024లో మరింత హింసకు దారి తీస్తోంది” అని తెలిపారు.