
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఇండియన్–అమెరికన్ వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే హెచ్1బీ వీసా విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విధానం తీసుకొస్తానని తెలిపారు. “ప్రస్తుతం హెచ్1బీ వీసా ప్రక్రియలో లాటరీ విధానం కొనసాగుతోంది. దాన్ని మార్చి మెరిట్ ఆధారిత విధానం తీసుకొస్తాను.
ప్రస్తుత లాటరీ విధానంలో వీసా స్పాన్సర్ చేసే కంపెనీకే ప్రయోజనం చేకూరుతోంది. ఇది ఒక విధంగా ‘ఒప్పంద సేవ’ లాంటిది. నేను దీన్ని మార్చేస్తాను” అని చెప్పారు. ‘‘దేశంలో చైన్ బేస్డ్ మైగ్రేషన్ ను నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పని చేసేందుకు వస్తున్న వర్కర్ల కుటుంబసభ్యులు ఎవరూ మెరిట్ పై రావడం లేదు. దేశ సరిహద్దులను కాపాడేందుకు మిలటరీని ఉపయోగిస్తాను. అక్రమ వలసదారులను అడ్డుకుంటాను” అని పేర్కొన్నారు.