
తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో తన పాత్రను గుర్తించే టీఆర్ఎస్ లో చేరినప్పుడు.. టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. టికెట్ రాకపోవడంతో.. అభిమానుల మధ్య ఉద్వేగానికి లోనయ్యారు వివేక్. తెలంగాణ అభివృద్ధి కోసం, పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం జరిగిందనీ, అయినా జనంలోనే ఉండి పనిచేస్తానన్నారు వివేక్. పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానన్నారు వివేక్.
టికెట్ ఇవ్వకపోయినా.. టికెట్ ఇవ్వనందుకు చూపిన సాకులే ఎక్కువ బాధించాయని ఉద్వేగానికి లోనయ్యారు వివేక్. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే.. రాజకీయ సన్యాసానికి సిద్ధమని కేసీఆర్ తో చెప్పానన్నారు. ఆ రోజు.. అలాంటిది ఏమీ లేదని చెప్పి… ఇప్పుడదే సాకుతో టికెట్ ఇవ్వలేదన్నారు వివేక్.