
కర్ణాటకలో సీట్లు తగ్గినప్పటికీ ఓటింగ్ శాతం తగ్గలేదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. 2018 లో బీజేపీతో ఉన్న ఓటర్లు ఇప్పుడు కూడా తమతోనే ఉన్నారని చెప్పారు. అయితే ఈ సారి జేడీఎస్ ఓట్ల శాతం కాంగ్రెస్ కు పోవడంతో ఆ పార్టీ సీట్లు పెరిగాయన్నారు
కర్ణాటకలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మూడున్నరేళ్లలో భారీ అభివృద్ధి జరిగిందన్నారు వివేక్ వెంకటస్వామి. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా గతం కంటే కర్ణాటకలో భారీ కేటాయింపులతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కర్ణాటక ఓటర్లు అభివృద్ధి కంటే కూడా గత మూడు దశబ్దాలుగా ప్రతి దఫా ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా సరిగ్గా ఎన్నికల వేళ కాంగ్రెస్ సోషల్ మీడియా చేసిన దుష్ప్రచారం ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింసిందన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణాపై ప్రభావం చూపబోదన్నారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణాలో కాంగ్రెస్ గ్రౌండ్ పూర్తిగా బలహీనపడిందని చెప్పారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బూత్ స్థాయి నుంచి బలడుతూ వస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బాగా బలడిందనేందుకు దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే నిదర్శనమన్నారు. అంతే కాకుండా మునుగోడు ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందన్నారు. బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉధృతంగా ఉద్యమాలు చేస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి.