జేపీ నడ్డాను కలిసిన రాజగోపాల్ రెడ్డి, వివేక్

జేపీ నడ్డాను కలిసిన రాజగోపాల్ రెడ్డి, వివేక్


బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలొ బిజిబిజీగా ఉన్నారు. శుక్రవారం అమిత్ షాను కలిసిన ఇరువురు నేతలు..ఇవాళ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. బీజేపీలో  చేరుతుండడం పట్ల కోమటిరెడ్డిని నడ్డా అభినందించారు. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకరావాలని సూచించారు.

మరోవైపు బండి సంజయ్ కు ఢిల్లీ వెళ్లారు. సంజయ్ ఆహ్వానం మేరకు దాసోజు శ్రవణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఈనెల 21న మునుగోడు సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాలను ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా బీజేపీ పాదయాత్ర విశేషాలను, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను, బీజేపీలోకి రావాలనుకుంటున్న నాయకుల లిస్టుపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం