కరోనా వస్తే సర్కార్ దవాఖానాకు నువ్వెందుకు పోలె

కరోనా వస్తే  సర్కార్  దవాఖానాకు నువ్వెందుకు పోలె

కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే కేసీఆర్ హుజూరాబాద్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి.  కరోనా ట్రీట్ మెంట్ కోసం సర్కార్ హాస్పిటల్స్ కు వెళ్లాలని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్..తనకు కరోనా వస్తే ప్రైవేటు హాస్పిటల్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు . కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేదంటే ఆయుష్మాన్ భారత్ లో చేరాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని విమర్శించారు. ట్రీట్ మెంట్ కోసం ఇప్పటివరకు కట్టిన బిల్లుల్ని ప్రజలకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్ తో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ఇళ్లలోనే వాళ్లు కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తామన్నారు.