
పెద్దపల్లి జిల్లాలోని రంగాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కాకా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేశారు.
వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని తమ దృష్టికి వచ్చిన వెంటనే గొడుగులు పంపిణీ చేశామని వివేక్ వెంకటస్వామి అన్నారు .పేద ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కాకా ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నామన్నారు.. గతంలోనూ పెద్దపల్లిలోని చాలా ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థులకు కూర్చోడవడానికి ఫర్నీచర్స్ పంపిణీ చేశామన్నారు.