పదివిలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల్లో ఉంటా: వివేక్ వెంకటస్వామి

పదివిలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల్లో ఉంటా: వివేక్ వెంకటస్వామి

తాను పదివిలో ఉన్నా.. లేకున్నా.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటానని చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 2023, నవంబర్ 17వ తేదీ శుక్రవారం నియోజకవర్గంలోని శంకరాపురం గ్రామంలో వివేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి కట్టే పనున్న ఎగొట్టి ఇసుక అమ్ముకోవడం బాల్క సుమన్ కు తెలుసని..  ఇసుక దందాతో బాల్క సుమన్ వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

సీఎం దత్తపుత్రుడికి ప్రజల సమస్యలు అవసరం లేదని మండిపడ్డారు.  చెన్నూరు ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందలేదని చెప్పారు. రాష్ట్రంలోని చాలా మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.  కాళేశ్వరం ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ విదేశాల్లో.. కవిత లిక్కర్ దందాతో ఢిల్లీలో ఉంటే ప్రజలను పట్టించుకునేదెవరు అని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు.