కాళేశ్వరంతో మంథని రైతులకు నష్టం: వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరంతో మంథని రైతులకు నష్టం: వివేక్ వెంకటస్వామి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గ రైతులు నష్టపోయారని, 40 వేల ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నా రాష్ట్ర సర్కారు పరిహారం ఇవ్వట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దగ్గర దోచుకున్న రూ. 100 కోట్లతో కేసీఆర్ నాందేడ్​లో బీఆర్ఎస్ సభ నిర్వహించారని విమర్శించారు. మంథని ప్రజా చైతన్య యాత్ర, మంథని ప్రజా గోస‒ బీజేపీ భరోసా, గడప గడపకు సునీల్ అన్న పేరుతో బీజే పీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి చేపట్టిన యాత్రను ఆదివారం జయశంకర్‌‌‌‌ భూపాలప ల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం అన్నారం గ్రా మంలో వివేక్‌‌‌‌ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఉట్లపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్‌‌‌‌ మంథని నియోజకవర్గ ప్రజలకు అన్యా యం చేశారన్నారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డిని ప్రపంచంలోనే ధనవంతుడిగా చేశారన్నారు.

కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి: చంద్రుపట్ల సునీల్‌‌‌‌ 

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. గ్రామాలలో  శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డు లు, ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయని తెలిపారు. జీపీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దొంగలాగా రాత్రికి రాత్రే మళ్లించిందన్నారు.  కేసీఆర్‌‌‌‌ అవినీతి, కుటుంబ పాలనను తరిమేయడానికి బీజేపీ కంక ణం కట్టుకుందన్నారు. మిగులు బడ్జెట్‌‌‌‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌‌‌‌ సర్కార్​దే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నది అన్నారం గ్రామంలోనే అయినందున ఇక్కడి నుంచే తన యాత్రను మొదలుపెట్టానని వెల్లడించారు. ప్రోగ్రాంలో మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్, యాత్ర ప్రముఖ్ వెన్నంపల్లి పాపయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్​ రావుల రామ్ నాథ్, పార్టీ నాయకులు అనిల్ రెడ్డి, శ్రీమన్నారాయణ, యాత్ర సహ ప్రముఖ్ లు దుర్గం తిరుపతి, మల్కామోహన్ రావు, పిలుమారి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, పాగే రంజిత్ కుమార్, ఎంపీటీసీ ఉడుముల విజయారెడ్డి, జంగంపల్లి అజయ్, బొల్లం కిషన్, సూరం మహేష్, మంథని రాజేందర్, పూసల రాజేంద్రప్రసాద్, గంట అంకయ్య, పసుల శివ తదితరులు పాల్గొన్నారు.   

నష్టపోతున్నా పట్టించుకోవట్లే 

కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల ప్రాజెక్టు అని, ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోతున్న రాష్ట్ర రైతులను పట్టించుకోకపోవడం బాధాకరమని వివేక్ అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మునిగిపోతుండటం వల్ల ఇక్కడి రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ప్రతి నెలా జీతాల పేరుతో రూ. 30 లక్షల ప్రజల సొమ్మును దోచుకుంటోందని విమర్శించారు. ప్రధాని మోడీకి ప్రజలపై ప్రేమ ఉన్నందుకే ఉచిత రేషన్ ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదలకు వేలాది ఇండ్లు కట్టించారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇలాంటి యాత్రలు చాలా అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను గద్దె దింపి, బీజేపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. 

నడ్డా కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన వివేక్ వెంకటస్వామి

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలకు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్​కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో  నడ్డా చిన్న కుమారుడి వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు హరీశ్, రిద్దిలను వివేక్ ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్య నేతలు సంజయ్, వెదిరె శ్రీరాం, లక్ష్మణ్, పొంగులేటి తదితరులు హాజరయ్యారు.