
కర్ణాటకలో విశ్వగురు శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కుష్టగీ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా వివేక్ వెంకటస్వామి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. కుష్టగి నియోజకవర్గ ఇన్ చార్జ్గా ఉన్న ఆయన...బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు.