సీఎం కుంభకర్ణుడి నిద్రలో ఉన్నరు

సీఎం కుంభకర్ణుడి నిద్రలో ఉన్నరు

రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని  బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వినాయక పూజలో పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తరుణ్ చుగ్ ముఖ్యమంత్రి కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారని  విమర్శించారు..  రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని.. ఈ నెల 17 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన వేడుకలకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు.