వెబ్సైట్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

వెబ్సైట్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్సైట్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. దేశంలో తొలిసారి ఇలాంటి వెబ్ సైట్ తీసుకురావడం పట్ల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశాన్ని ప్రశంసించారు. షెడ్యూల్ కులాల్లో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల చరిత్ర, సంస్కృతులు, వారి జీవన విధానాన్ని వెబ్సైట్ ద్వారా సమాజానికి పరిచయం చేసే గొప్ప ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు.

దళిత బంధు పథకంలో ఉపకులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. వారి సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.