
టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనపై బంజారాహిల్స్ లో ఎంపీ అర్వింద్ ను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన..భయంతోనే టీఆర్ఎస్ గుండాలు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. నిన్న జరిగిన ఘటనతో అర్వింద్ కు టీఆర్ఎస్ ను..కేసీఆర్ నియంతృత్వ పాలనను బొంద పెట్టాలనే జోష్ వచ్చిందన్నారు. నిన్న జరిగిన ఘటనకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు.
తెలంగాణలో పోలీసు వ్యవస్థను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటేన్ చేయకపోతే కేసీఆర్ కు టైం దగ్గర పడుతుందన్నారు. దమ్ముంటే కవిత అర్వింద్ సవాల్ ను స్వీకరించి ఆయనపై పోటీ చేయాలన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలుకు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని తప్పకుండా బీజేపీ బయటపెడుతుందన్నారు. మునుగోడులో ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యారన్నారు.టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా మందు,డబ్బులు పంచినా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా 80 వేలకు పైగా ఓట్లు పడ్డాయన్నారు.