కేంద్ర హోం మంత్రిని కలిసిన వివేక్ వెంకటస్వామి

కేంద్ర హోం మంత్రిని కలిసిన వివేక్ వెంకటస్వామి

కేంద్ర హోంశాఖ  మంత్రి  అమిత్ షాను  కలిశారు మాజీ  ఎంపీ జీ. వివేక్ వెంకటస్వామి.  రాష్ట్రంలో  హెరిటేజ్ భవనాల  కూల్చివేత,  కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై  ఫిర్యాదు చేశారు. పాతది  కూల్చి …కొత్తది  కట్టడం  అంటే…ప్రజాధనం  దుర్వినియోగం  చేయడమేనన్నారు.  దీన్ని అడ్డుకోవాలని  కేంద్ర హోం మంత్రి  షాను  కోరారు. ప్రభుత్వ తీరుపై  ఇటీవల నిర్వహించిన… ఆల్ పార్టీ మీటింగ్  తీర్మానాలను  వివరించారు  వివేక్ వెంకటస్వామి.వాస్తు కారణాలతో  పాత సెక్రటేరియట్ ను  కూల్చివేసి… కొత్త సెక్రటేరియట్  నిర్మించాలని చూస్తున్నారన్నారు  వివేక్ వెంకట్ స్వామి.  తెలంగాణ రాష్ట్రానికి లక్షా 82 వేల కోట్ల అప్పులు ఉన్నాయని  ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు, బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ  మర్చిపోయారన్నారు.  వేల కోట్ల ప్రజాధనం వృధా  చేస్తున్నారన్నారు షాకు ఫిర్యాదు చేశారు వివేక్ వెంకట్ స్వామి