జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలేవీ?: వివేక్ వెంకటస్వామి

జైపూర్ పవర్ ప్లాంట్ లో  స్థానికులకు ఉద్యోగాలేవీ?: వివేక్ వెంకటస్వామి

 

  • మేం అధికారంలోకి రాగానే అవకాశాలు కల్పిస్తం
  • బీఆర్ఎస్​ఇచ్చే డబ్బులు తీసుకొని హస్తం గుర్తుకు ఓటేయ్యండి
  • కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి

మంచిర్యాల: జైపూర్ పవర్ ప్లాంట్ లో లోకల్ వాళ్లకు ఉద్యోగాలు లేవు అని, తాము అధికారంలోకి రాగానే అవకాశాలు కల్పిస్తామని అని కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి అన్నారు. ‘బీఆర్ఎస్ లీడర్లు డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం హస్తం గుర్తుకే ఎయ్యాలే’ అని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలం శెట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ చేరికల సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో  ఆయన మహిళలతో కలిసి డ్యాన్స్​స్టేప్​వేశారు. 

అనంతరం వివేక్​మాట్లాడుతూ ‘చెన్నూరును అభివృద్ధి చేయాలని బాల్క సుమన్ ను గెలిపిస్తే ప్రగతి భవన్ లో పని చేస్తున్నాడు.  గత ఎన్నికల సమయంలో 100 కేసులు నాపై ఉన్నాయని అన్నడు. జైపూర్ మండలంలో చాలా మంది కాంగ్రెస్ నాయకుల మీద సుమన్ తప్పుడు కేసులు పెట్టిండు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నఅలాంటోళ్లను తరిమేయాలి. ఓటుకు 5 వేల రూపాయలు బాల్క సుమన్ ఖర్చు పెడుతున్నాడు. అది ప్రజల సొమ్ము.  ఆయన ఇచ్చే డబ్బు తీసుకోండి తప్పులేదు. కానీ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.