బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నూతన గ్రామపంచాయతీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రూ. 5 లక్షల రూపాయల ఎమ్మెల్సీ ఫండ్ నుంచి మంజూరైన నిధులతో కొండాపూర్ గ్రామపంచాయతీని నిర్మించారని తెలిపారు.

2009లో ఎంపీగా గెలుపొందడంలో జీవన్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు వివేక్ వెంకటస్వామి. జీవన్ రెడ్డిని కలిసిన ప్రతి సారి ఒక మంచి విషయం నేర్చుకున్నానని తెలిపారు. 

తెలంగాణలో ప్రజా పాలన మొదలైందని వివరించారు. ప్రజా ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందుండాలని కాంగ్రెస్ పార్టీని,  సీఎం రేవంత్ రెడ్డి గెలిపించారని పేర్కొన్నారు. 2009లో రాయపట్నం నుంచి లక్షటి పేట్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు.