
సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు నుంచి వలసలు ఏ మాత్రం ఆగడం లేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులుపూర్తి చేసినా పచ్చగ మారే పాలమూరును ఎడారి చేయడం తప్పా కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
వలసలు ఆగిపోయాయని.. తెలంగాణకే ఎదురు వలసలు వస్తున్నట్లుగా అబద్ధాలు చెబుతూ ఇంకా ఎన్నేండ్లు గడుపుతారని ప్రశ్నించారు. మత్తు వదిలి, ఫాంహౌస్ నుంచి బయటికొచ్చి చూస్తేగానీ కేసీఆర్ కు బయటి పరిస్థితి అర్థంకాదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ నిజాలు తెలుసుకోవడం మంచిదన్నారు.
అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ, మీరు చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా? ఎనిమిదేండ్లుగా మీ ‘బంగారు పాలన’ తర్వాత కూడా పాలమూరు నుంచి వలసలు ఏ మాత్రం ఆగలేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసినా పచ్చగమారే పాలమూరును ఎడారి చేయడం తప్ప మీరు చేసిందేం లేదు. (1/2) #KCRFailedTelangana #Palamuru pic.twitter.com/6nOgO8t6Gq
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) May 13, 2022