
ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం సీఎం కేసీఆర్ కు అలవాటేనన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. హుజురాబాద్ లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంతి ఓ మోసగాడని.. ఎలెక్షన్స్ వచ్చినప్పుడే లేస్తడన్నారు. నాగార్జున సాగర్ లాంటి చోట్ల ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల సీఎంలో ఇంటికి పది వేలు, ఉచిత తాగునీరు ఇస్తానని ఇవ్వలేదన్నారు. హుజురాబాద్ లో ఓటమి తప్పదని తెలిసి ఇప్పుడు దళితులకు ఇంటికి పది లక్షలు అంటున్నాడన్నారు. దీన్ని స్వాగతిస్తున్నాం కానీ.. ఇస్తాడనే నమ్మకం మాత్రం మాకు లేదన్నారు వివేక్ వెంకటస్వామి.