ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో సీఎం కేసీఆర్ ..మెగా కృష్ణారెడ్డిని ధనికుడు చేయాలని చూస్తుండన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి.కాళేశ్వరం వల్లే మెగా కృష్ణారెడ్డి దేశంలోనే 65వ స్థానంలో ఉన్నాడన్నారు. మెగా కృష్ణారెడ్డిని వరల్డ్ 30వ స్థానానికి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ లో రైతుభరోసా యాత్రకు హాజరైన వివేక్ కాళేశ్వరం లింక్ 2 పైపులైన్ పనులు, పంప్ హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి క్యాబినెట్ ఉద్యోగాలిచ్చాడే తప్ప.. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఉద్యోగాలివ్వలేదన్నారు. సీఎం ఫాం హౌస్ కోసం 100మీటర్ల నుంచి 600 మీటర్లకు నీటిని తీసుకుపోవడం అవసరమా.?అని ప్రశ్నించారు. రైట్ టూ ఇన్ఫర్మేషన్ కింద సమాచారంలో కాళేశ్వరం కింద.. ఐదువేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు తెలిసిందన్నారు. మరి రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వరన్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి మెడలు వంచామని.. అందుకే ఎల్ఆర్ఎస్ వెనక్కి పోయిందన్నారు. వాళ్లు మాత్రం దోచుకుని ఆస్తులు పెంచుకున్నారని..రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాలు చేశారన్నారు.
