రోడ్డు ప్రమాద బాధితులకు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి భరోసా

రోడ్డు ప్రమాద బాధితులకు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి భరోసా

పిట్లం, వెలుగు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి తెలిపారు. జనం గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆదివారం పిట్లం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చిల్లర్గికి వెళ్లిన ఆయన అన్నాసాగర్​వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తల్లిని, నానమ్మను కొల్పోయిన నాగలక్ష్మి తన గోడును వెళ్లబోసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయానని, తండ్రికి వెన్నుముకకు గాయమై మంచానికే పరిమితం అయ్యాడని తెలిపింది. ప్రభుత్వం ఇస్తానన్న సాయం ఇప్పించాలని వేడుకుంది. ఇందుకు వివేక్​ వెంకటస్వామి స్పందిస్తూ ప్రమాద బాధితులకు పీఎం మోడీ రూ.2 లక్షలు ప్రకటించారని, వాటిని త్వరలో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జడ్పీ మాజీ చైర్మన్‌‌‌‌ వెంకటరమణారెడ్డి, జనరల్ సెక్రటరీ కాలకుంట్ల రాము, పిట్లం ప్రెసిడెంట్ అభినయ్‌‌‌‌రెడ్డి, సెక్రటరీ సాయిరెడ్డి పాల్గొన్నారు.