చెన్నూరు అభివృద్ధే నా లక్ష్యం: వివేక్ వెంకటస్వామి

చెన్నూరు అభివృద్ధే నా లక్ష్యం: వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. డిసెంబర్ 3వ తేదీ వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకట స్వామి ఘన విజయం సాధించారు.

బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37వేల ఓట్ల మెజార్టీతో వివేక్ గెలిచారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ వివేక్ వెంకటస్వామి సోదరుడు, గడ్డం వినోద్ గెలుపొందారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

మొదట డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా..  అనూహ్యంగా డిసెంబర్ 4వ తేదీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థులందరినీ హైదరాబాద్ కు రావాల్సిందిగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందనిరితో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.