కాకా వర్థంతికి గవర్నర్ ను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి దంపతులు

కాకా వర్థంతికి  గవర్నర్ ను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి దంపతులు

ఈనెల 22న కాకా వెంకటస్వామి వర్థంతి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సైను బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి దంపతులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. 

1929 అక్టోబర్​5న నిరుపేద దళిత కుటుంబంలో వెంకటస్వామి జన్మించారు. కార్మిక నేతగా మొదలైన ఆయన కెరీర్,.. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. పేదవాళ్ల కోసం తన జీవితాన్ని సైతం ధారపోసిన వెంకటస్వామి.. . 2014 డిసెంబర్ 22న కన్నుమూశారు. కాగా తాజాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసిన వివేక్ వెంకటస్వామి దంపతులు కాకా 8వ వర్థంతి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.