తెలంగాణలో లక్ష కోట్లకుపైగా సంపాదించింది వాళ్ళిద్దరే...

తెలంగాణలో లక్ష కోట్లకుపైగా సంపాదించింది వాళ్ళిద్దరే...

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు  వాగ్దానాలు ఇస్తున్నాడన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ మోసగాడని.. ఎన్నికలు రాగానే హామీలిచ్చి ఎన్నికలయ్యాక మర్చిపోతాడన్నారు. తెలంగాణలో లక్ష కోట్లకుపైగా సంపాదించిన వాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారని..వాళ్లలో ఒకరు కేసీఆర్, మరొకరు మెగా క్రిష్ణారెడ్డి అన్నారు.

కేసీఆర్-జగన్-మెగా క్రిష్ణారెడ్డి కలిసి తెలంగాణను దోచుకుతింటున్నారన్నారు.  ఈ అవినీతిని ఎండగట్టడంతోపాటు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. హుజురాబాద్ లో తాను చేయించిన సర్వేలో ఈటల రాజేందర్ కు 70 శాతానికిపైగా ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్నారు.