స్లిమ్​ బాడీతో వివో వీ30ఈ

స్లిమ్​ బాడీతో వివో వీ30ఈ

 గ్లోబల్​ స్మార్ట్​ఫోన్ ​బ్రాండ్ ​వివో మనదేశంలో వీ30ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఇందులో  6.78- అంగుళాల డిస్‌‌‌‌‌‌‌‌ప్లే ,44 వాట్ల ఛార్జర్‌‌‌‌‌‌‌‌తో కూడిన 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఫన్​టచ్​14  ఓఎస్​,  12జీబీ వరకు వర్చువల్ ర్యామ్, వెనుక 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్​882 సెన్సర్​ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

 8జీబీ+128జీబీ వేరియంట్‌‌‌‌‌‌‌‌కు రూ.27,999 కాగా,  8జీబీ+256జీబీ మోడల్‌‌‌‌‌‌‌‌ రూ.29,999. ఇది ఈనెల 9 నుంచి అమ్మకానికి వస్తుంది.