
వివో సబ్–బ్రాండ్ ఐకూ ఈ నెల 15న తన లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్9 లైట్‌ను ఇండియా మార్కెట్‌కు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఏఐ కెమెరా, ఐపీ64 రేటింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది. జెడ్9 లైట్‌ను వివో గ్రేటర్ నోయిడా ప్లాంటులో తయారు చేస్తున్నామని ఐకూ తెలిపింది. తమకు దేశ వ్యాప్తంగా 670కిపైగా కంపెనీ సర్వీస్ సెంటర్లు ఉన్నాయని తెలిపింది.