
గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో యువత టార్గెట్‌గా టీ2, టీ2ఎక్స్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇవి రెండూ 5జీ డివైజ్‌లు. టీ2 ఫోన్ 6జీబీ+128జీబీ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.20,999. అమ్మకాలు ఈ నెల 18 నుంచి మొదలవుతాయి. టీ2ఎక్స్ ఫోన్ 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఇక 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 15,999 చెల్లించాలి. ఫ్లిప్ కార్ట్‌లో హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐలతో కార్డులతో కొంటే రూ.1000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ వస్తుంది.