వివో టీ3 5జీ ధర రూ.20 వేలు

వివో టీ3 5జీ ధర రూ.20 వేలు

న్యూఢిల్లీ: వివో టీ3 5జీ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో గురువారం లాంచ్ అయ్యింది. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన వివో టీ2 5జీకి సక్సెసర్ మోడల్ ఇది. ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్ అమర్చారు.

5,000 ఎంఏహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ సామర్ధ్యం, 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే వంటి ఫీచర్లు  ఉన్నాయి. వివో టీ3 5జీ (8జీబీ+ 128 జీబీ) ధర రూ.20 వేలు. 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ. 22 వేలు. ఈ నెల 27 నుంచి వివో ఇండియా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్స్ మొదలవుతాయి.