వివో నుంచి రూ.1,100 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌

వివో నుంచి రూ.1,100 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి మరో రూ.1,100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని స్మార్ట్‌‌‌‌ఫోన్ల తయారీ కంపెనీ వివో ప్రకటించింది. దేశంలో తమ ప్రొడక్షన్‌‌‌‌ను మరింత పెంచుతామని పేర్కొంది. గ్రేటర్ నోయిడాలోని తన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌ను వివో విస్తరిస్తోంది. కొత్త యూనిట్‌‌‌‌ను  వచ్చే ఏడాది ప్రారంభించనుంది. 

ఈ ఏడాది10 లక్షలకు పైగా మేడిన్ ఇండియా స్మార్ట్‌‌‌‌ఫోన్లను ఎగుమతి చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని, కిందటేడాది తమ మొదటి కన్‌‌‌‌సైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, సౌదీ అరేబియాకు పంపామని వెల్లడించింది.  దేశంలో రూ.7,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన వివో,  మొదటి ఫేజ్ కింద రూ.3,500 కోట్ల పెట్టుబడులను  ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేస్తామని వివరించింది. ఇప్పటికే రూ.2,400  కోట్లను ఇన్వెస్ట్‌‌‌‌ చేసింది.