
న్యూఢిల్లీ: వివో తన మొదటి మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. దీని పేరు వివో విజన్ డిస్కవరీ ఎడిషన్. యాపిల్ విజన్ ప్రో లాంటి ఇతర హెడ్సెట్లకు ఇది పోటీనిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2 ప్లస్ జెన్2 ప్లాట్‌ఫామ్‌పై ఇది పనిచేస్తుంది. ఈ హెడ్సెట్లో 8కే బైనాక్యులర్ రిజల్యూషన్‌ను అందించే రెండు మైక్రో -ఓఎల్ఈడీ డిస్ప్లేలు ఉన్నాయి. సాధారణ టచ్‌స్క్రీన్‌కు బదులు చేతి కదలికలు, కళ్ల కదలికలతో డివైజ్‌ను నియంత్రించొచ్చు. వినోదం, గేమింగ్, ప్రొడక్టివిటీ కోసం దీనిని ఉపయోగించొచ్చు.