పేరు మార్చుకోనున్న శశికళ..?

పేరు మార్చుకోనున్న శశికళ..?

రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలని జయలలిత నెచ్చెలి వీకే. శశికళ ఎన్ని ప్రయత్రాలు చేసినా ఫలించడం లేదు. ఆమె జైలు నుండి బయటకు వచ్చినప్పటినుండి అన్నాడీఎంకే పార్టీ నేతలు దూరం పెడుతున్నారు. దీంతో శశి కళ ఒంటరిగా మిగిలిపోంది.. ఈనేపథ్యంలో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు కూడా ప్రారంభించారు.పలు గుళ్లుగోపురాలను సందర్శించారు.

అయితే తన మద్దతుదారులు రాజకీయాల్లోనే కొనసాగాలని కోరడంతో మళ్లీ తన దృష్టిని రాజకీయల వైపు మళ్లించింది. ఈ సారి ఎలాగైనా.. అన్నాడీఎంకేను మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవాలని శశికళ విశ్వప్రయత్రాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాల్లో భాగంగా.. ఇటీవల శశికళ ఓ జ్యోతిష్యుడి కలిసినట్టు సమాచారం. ఆమె జాతకాన్ని చూసిన ఆయన.. పేరుతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూడా మార్చాలని సలహా ఇచ్చారని సమాచారం.ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ మార్చాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  మరి పేరు,ఇళ్లు మార్చాకైనా ఆమె రాజకీయ జీవితం మారుతుందో చూడాలి.